Showing posts with label Adigo na nava bayalu lyrics. Show all posts
Showing posts with label Adigo na nava bayalu lyrics. Show all posts

09 May 2023

Adigo na nava bayalu అదిగో నా నావ బయలు

అదిగో నా నావ బయలు దేరుచున్నది -
అందులో యేసు ఉన్నాడు -
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
 
వరదలెన్ని వచ్చినా వణకను - 
అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా -
సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
 
నడిరాత్రి జాములో నడచినా - 
నది సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు -
నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో||
 
లోతైన దారిలో పోవుచున్నది - 
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)
సూర్యుడైన ఆగిపోవును - 
చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...