Showing posts with label పంతగాని పరదేశి. Show all posts
Showing posts with label పంతగాని పరదేశి. Show all posts

02 May 2022

Sri yesu divya namasmarana | శ్రీ యేసు దివ్య నామస్మరణ

142
యేసు నామస్మరణ
రా - హిందుస్థానీ కాపి,   తా - రూపకము
(ఛాయ: ఆహా మహాత్మ! హాశరణ్య)

శ్రీ యేసు దివ్య నామస్మరణ- చేయవే మనసా = 
పాయక స్మరియించి పరము - పొందువే మనసా ||శ్రీ||

1.నరుల పాప హరణమునకై - నరుడయ్యె మనసా = పరమ పుర ద్వారంబు మనకు - తెరచెనే మనసా ||శ్రీ||

2.నరుల పాప శాప ఫలము - నరకమే మనసా = 
ఆ - మరణమును తొలంచప్రభువే - నుడిసె నేమనసా ||శ్రీ||

3.పాపమునకు ప్రాయశ్చిత్తం - భవ్యమే గదా = 
ప్రభువే ప్రాయశ్చిత్తం బలియై - పరగెనే మనసా ||శ్రీ||

4.సిలువవేసి ప్రభుని ప్రజలు - చంపిరే మనసా = 
ఆ - బలుడు తిరిగి లేచి మృతిని - గెలిచేనే మనసా ||శ్రీ||

5.గెలిచి యేసు హితులమధ్య - నిలిచెనే మనసా = 
నిలిచి సమాధాన మంచు - పలికెనే మనసా ||శ్రీ||

6.పునరుత్థాన మేసు దేవ - పుత్రుడని మహా = 
ఘనముగా ప్రకటించుచుండ - కాననే మనసా ||శ్రీ||

7.తానె మార్గం తానెసత్యం - తానెజీవము  
ఈ - ఘన సత్యంబు నమ్మునరులు - ధన్యులే మనసా ||శ్రీ||

8.నిన్ను నీ వెరింగి ప్రభుని - నెరుగ వే మనసా
సన్నుతు డందుల కొసంగె - సత్యవేదము ||శ్రీ||

9.పాపములకు పరితపించి - ప్రభుని జేరవే
దాపునకు రమ్మంచు కరము - చాపేనే మనసా ||శ్రీ||

10.ఎంత ఘోరపాపమైన - నెంచడే మనసా =
ఎంత మొత్తమైనను క్షమి - యించునే మనసా ||శ్రీ||

11.బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు మనసా
ఈ - బతుక్నందె ప్రభుని పదము - పట్టుకో మనసా ||శ్రీ||

12.జనక కుమారాత్మ దేవున్ - జపియించు మనసా = అనయమును స్మరించు స్వర్గ - మద్దియే మనసా ||శ్రీ||
            – పంతగాని పరదేశి

16 August 2020

Aha mahatma ha sharanya lyrics | ఆహా మహాత్మ హా శరణ్యా

196
క్రీస్తు సిలువమిఁద పల్కిన యేడు మాటలు 
రా - హిందుస్థాని కాపి, తా - రూపకము

ఆహా మహాత్మ హా శరణ్యా - హా విమోచకా = ద్రోహ రహిత చంపె నిను నా - దోష మేగదా ||యాహా|| 
 
1."వీరలను క్షమించు తండ్రి - నేర రేమియున్” = కోరి తిటులు నిన్ను జంపు - క్రూరజనులకై ||యాహా||
 
2.“నీవు నాతో బరదైసున - నేడె యుందువు” = పా వనుండ యిట్లు బలికి - పాపి గాచితి ||యాహా||
 
3.“అమ్మా! నీ సుతుడ" టంచు మరి - యమ్మతో బలికి - క్రమ్మర "నీ జనని” యంచు - గర్త నుడివితి ||యాహా||
 
4.“నా దేవ దేవ యేమి విడ - నాడితి" వనుచు = శ్రీ  దేవసుత పలికితివి శ్రమ - చెప్పశక్యమా ||యాహా||
 
5.“దప్పికొనుచున్నా న" టంచు - జెప్పితివి గద = యిప్పగిదిని బాధ నొంద - నేమి నీకు హా !||యాహా||
 
6.శ్రమ ప్రమాదములను గొప్ప - శబ్దమెత్తి హా = "సమాప్తమైన” దంచు దెలిపి- సమసితివి గదా ||యాహా||
 
7.“అప్పగింతు దండ్రి నీకు- నాత్మ" నంచును = గొప్ప యార్భాటంబు చేసి - కూలిపోతివా॥యాహా||
- పంతగాని పరదేశి
DOWNLOAD MP3 SONG HERE 👇

Kalvari giri cheru manasa కల్వరి గిరిజేరు మనసా

202
సిలువ ధ్యానము
రా - సురటి, తా - ఆది 

కల్వరి గిరిజేరు మనసా - సిల్వ సరస ||కల్వరి||
 
1.సిలువపైన జూడు మదేమి - శ్రీ కరుడు ప్రభు యేసు స్వామి = తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి||
 
2.పరులకుపకారంబు సల్ప - ధరను వెలసిన వరపాదముల = కఱకు మేకులు గొట్టెద రేల - కరుణాలవాల ||కల్వరి||
 
3.కరముపట్టి దరినిజేర్చి- వరములిడి దీవించిన యా = కరుణగల చేతులలో చీల - గుచ్చెద రేల ||కల్వరి||
 
4. ప్రేమ కృప నిర్మలత్వమును - నీమమును గల మోము పైన = పామరులుమి వేసెద రేల - పాటించ రేల ||కల్వరి||

5.ఘోర యాతనలును నీదు - క్రూరమరణము చూడ గుండె = నీరు నీరై పోవదె దేవ - క్రూరునికైనా ||కల్వరి||
 
6.పాపమేమిచేసి యెరుగవు - పావన పరమ దేవుడవు = ఓ పరాత్పర నీకేమి యింత - ఉత్కట బాధ  ||కల్వరి||
 
7.స్వామి మాకై పూటపడను నీ - ప్రేమయే కారణము నిజము = భూమి యది గుర్తింపగ నిమ్ము - పూజ్యుండ దేవ ||కల్వరి||
 
8.పావనాత్మ నీవు జావ - పాపి కబ్బును నిత్యజీవ = మా వచన సత్యంబు దెల్పుము - మానవాళికిన్ ||కల్వరి||
 
9.సిలువ దరి కాకర్షించుము - ఖలుడను ఘోరపాపిని = కలుషములు విడ శక్తి నీయుము - సిలువ ధ్యానమున ||కల్వరి||
- పంతగాని పరదేశి 
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...