Showing posts with label ఈ. Show all posts
Showing posts with label ఈ. Show all posts

31 May 2026

ఈ సంఘం పునాది క్రీస్తే సాధీశుఁడే Ee sangham punaadi kreesthe

264
The Church's one foundation 

1.ఈ సంఘం పునాది 
క్రీస్తే సాధీశుఁడే 
దక్కించె యేసు దీని 
వాక్కాపుల్ రెట్టించే 

పై నుండి వచ్చి యేసు 
పెండ్లాడె నీమెనే 
కోరుచు రక్త మిచ్చి 
కొనె నీ కన్యనే

2.ఒక్కఁడే దేవుఁడిందు 
ఒక్క విశ్వాసము 
ఒక్కటే జన్మ మిందు 
ఒక్క కుటుంబము 

ఒక్క ప్రసాద విందు 
ఒకే సునామము 
నిరీక్షణొక్క టిందు 
నిరంత ప్రాప్తికే

3.అసత్య మార్గమంచు 
అనేకుల్ నవ్వినన్ 
విభాగ మై శ్రమంబుల్ 
విశేష మొందినన్ 

సుభక్తుల్ వేడుచుంద్రు 
అభయ కాంతికై 
యీ నింద లెల్లఁ బోయె 
ఆనంద నాటికై

4.కఠిన దుఃఖ బాధల్ 
కల్గిన నోర్చుచు 
విభ వానంద ప్రాప్తి 
లభింపఁ గోరుచు 

ఆ స్వర్గ పంక్తిఁజేరి 
యానంద మొందుచున్ 
యీ సంఘ మేసుఁ గూడి 
విశ్రాంతి బొందును
- సామ్యూల్ జాన్ స్థాన్ 
- అను: ఆల్ప్రెడ్ త్యాగరాజు పామర్ 

26 May 2025

Ee loka yatralo ne saaguchunda ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక||

జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక||

నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక||

తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||

09 June 2022

Eeyana yesu rakshakudu | ఈయనా యేసు రక్షకుడు

164 
ఆశ్చర్యకరమగు క్రీస్తు ప్రేమ
(ఛాయ: ఈలాటిదా యేసు ప్రేమ)
రా - ఆనందభైరవి,  తా - కురుఝుంపె

  ఈయనా యేసు రక్షకుడు తన - దాయమని రక్షింపఁ - దలఁచెనా నన్ను - నీయనా యేసు రక్షకుఁడు = ఆయాసమగు నొక్క మోపు - నే - మోయలేకుండ నా - మూపుపై నుండ - శ్రేయఃకరపు సిలువఁజూపి - నాకు - హాయి నిచ్చెను భార - మంత వెడలించి ||యీయనా||

1.దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ - బరిశుద్ధుఁడా యేసు - ప్రభుఁడు కరుణింప = ధరణిలో నిది మహాద్భుతము - నే - మరుతునా యీ ప్రేమ - మరణమౌ దాఁక ||ఈయనా||

2.ఓపఁగూడని దుష్కృతంబుల్ - నేను - తేపతేపకుఁ జేసి - ద్వేషినై యుండఁ = గోప మింతైన రానీక - నన్నుఁ - గాపురుషుఁ డని తాను - ఖండింపఁ డాయె ||నీయనా||

3.మనస్తమో గుణము లెడబాపెన్ - నా - దినకరోదయ మట్లు - దీప్తిమది మించెన్ = తన పాదములఁ జాడ లబ్బెన్ - సదా - వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుఁగు ||నీయనా||

4.హతుఁ డయ్యె నాయేసు నాకై - దు - ర్గతి తొలఁగి నాకు మో - క్షమే గల్గు కొఱకు = అతి దయాదీర్ఘశాంతుండే - దైవ - సుతుఁ డని యెఱిగితి - శోధింపఁగాను ||ఈయనా||

5.దీవింపఁదగు నతని సిలువ నా - జీవాంతమగు దనుక - చెలఁగి మోయుచును = ఈ వసుంధర జనుల కెల్ల మీరు - సేవించుఁ డేసునని - చెప్పి చాటుదును ||ఈయనా||
                         – మిక్కిలి సమూయేలు

02 January 2022

Ee Ningi Nela Kanumarugaouthunna | ఈ నింగీ నేలా కనుమరుగౌతున్నా

ఈ నింగీ నేలా కనుమరుగౌతున్నా 
ఈ గాలి నీరు కలుషితమౌతున్నా 
ఏ స్వార్ధం లేని ప్రేమ నీదయ్యా 
ఏ డంబము లేని ప్రేమ నీదయ్యా 
నిజమైన స్నేహితుడా నిను వీడి నేపోగలనా 

1. వాగ్దానం నెరవేర్చావు వరములను కురిపించావు
కొరతేమి లేకుండా నను నడిపించావు 
పడకుండా నిలబెట్టావు పదిలంగా ప్రేమించావు 
నా చేయిపట్టి నడిపావు 

2. కలిమిలో తోడైనావు కలతలో ఓదార్చావు 
ప్రేమతో దరిచేరావు హద్దులు చెరిపావు 
విలువతో నను కొన్నావు ప్రాణాలను అర్పించావు 
నా కొరకు మరణము పొందావు

08 June 2021

Ee Loka Yathralo Ne Saaguchunda | ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు - ఒకసారి యేడ్పు (2)
అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2) || ఈ లోక ||

1. జీవిత యాత్ర ఎంతో కఠినము (2) 
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు (2) 
కాయువారెవరు రక్షించేదెవరు (2) || ఈ లోక ||

2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆధరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు(2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) || ఈ లోక ||

3.తోడై యుండెదవు అంతము వరకు (2) 
నీవు విడువవు అందరు విడచినను (2) 
నూతన బలమును నాకొసగెదవు (2) 
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) || ఈ లోక ||
DOWNLOAD MP3 SONG HERE👇

02 June 2021

Ee Parinaya Shubhavela Swagatham | ఈ పరిణయ శుభవేళ స్వాగతం

ఈ పరిణయ శుభవేళ స్వాగతం -
నవ వరుడా (వధువా) స్వాగతం (2) 
సంధించను నీ సతిన్ (పతిన్)
అందుకొనుమా స్వాగతం (2)

1.దివ్యమైన స్నేహ బంధం అలరించగా - 
నవ్యమైన ప్రేమ గీతం పలికించగా -
మరువక తండ్రి మాట మదినుంచగా - 
వరుడగు క్రీస్తు బాట పయనించగా -
మరుమల్లెలు పలికాయి స్వాగతం (2)
కలగాలని దీవెనలు స్వాగతం (2) ||ఈ పరిణయ||

2.కాలు మోపు ఇంటిలోన మణిదీపమై - 
మేలు చేసి తృప్తినొందు గుణశీలియై - 
భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై - 
కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియై -
విరజాజులు పలికాయి స్వాగతం (2) 
వెలగాలని ఈ ధరలో స్వాగతం (2) ||ఈ పరిణయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

30 May 2021

Ee Nela Nethutitho Thadichena | ఈ నేల నెత్తుటితో తడిచేనా ఆ తల్లి

ఈ నేల నెత్తుటితో తడిచేనా - 
ఆ తల్లి హృదయం వగచేనా (2)
రాజైన యేసయ్యా - నీ కెంత బాధయ్యా 
నా పాప శాపం సిలువై నిను వేదించేనా 

1.త్యజియించినావు ఆ సౌఖ్యం - దిగివచ్చినావు 
నాకోసం నాకిచ్చినావు నీసర్వం - వర్ణించలేను నీ త్యాగం
నా శిక్షయేగా నీ సిల్వమరణం - విడిపించినావయ్యా ||ఈ నేల||

2.ఏ దోషం లేనిది నీ కాయం - అయినా ఎందుకు ఆ గాయం 
నీవు నిలిచింది నా స్థానం - నాకై విడిచావు నీ ప్రాణం
వెలలేనిదయ్యా నీ శుద్దరుధిరం - నను కడిగినావయ్యా ||ఈ నేల||

3.భరియించినావు నా శాపం - క్షమియించినావు నా పాపం 
సహియించినావు ఆఘోరం - తొలగించినావు నా భారం 
విలువైనదయ్యా కల్వరి యాగం - నే మరువలేనయ్యా  ||ఈ నేల||
DOWNLOAD MP3 SONG HERE 👇

05 February 2021

Ee Jeevitham Viluvainadi | ఈ జీవితం విలువైనది

ఈ జీవితం విలువైనది - నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా... చివరి యాత్రకు....
యుగయుగాలు దేవునితో ఉండుటకు - నీవుండుటకు ||ఈ జీవితం||

1.సంపాదన కోసమే పుట్టలేదు నీవు - 
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చూచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం||

2.మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు - 
కలకాల మీలోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం||

3. పాపులకు చోటులేదు పరలోకమునందు - 
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||
                                       – సత్యవేద సాగర్ 
DOWNLOAD MP3 SONG HERE 👇

28 August 2020

Eelatida Yesu Prema | ఈలాటిదా యేసు ప్రేమ

165 
యేసుని నిరుపమాన ప్రేమ
రా - ఆనంద భైరవి, తా - అట

ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను - తులనాడక తనదు = జాలి చుపినదా||ఈలాటి||

1.ఎనలేని పాపకూపమున - నేను - తనికి మినుకుచును నే - దరిఁ గానకు డన్ = కనికరము బెంచి నా యందు - వేగం - గొని పోవ నా మేలు - కొర కిందు వచ్చె ||ఈలాటి||

2.పెనుగొన్న దుఃఖాభిలోన - నేను - మునింగి కుములుచు నేడు - పునగుందు నపుడు - నను నీచుఁడని త్రోయలేక - తనదు నెనరు నా కగుపరచి నీతిజూపించే ||ఈలాటి||

3.నెమ్మి రవ్వంతైన లేక చింత - క్రమ్మి పొగలుచు నుండ - గా నన్ను జూచి = సమ్మతిని నను బ్రోవ దలచి - కరముం - జాచి నా - చేయిబట్టి - చక్కగా బిలిచె ||ఈలాటి||

4.పనికిమాలిన వాడనైన - నేను - కనపరచు నాదోష - కపట వర్తనము - మనసు నుంచక తాపపడక యింత - ఘనమైన రక్షణ - మును నాకు జూపె ||ఈలాటి||

5.నా కోర్కె లెల్ల సమయములన్ - క్రింది - లోక వాంఛల భ్రమసి - లొంగెడు వేళన్ = చేకూర్చి దృఢము చిత్తమునన్ - శుభము - నా కొసంగె జీవింప - నా రక్షకుండు ||ఈలాటి||

6.శోధనలు నను జుట్టినపుడు - నీతి - బోధ నా మనసులో  - బుట్టించి పెంచి = బాధ లెల్లను బాపి మాపి - యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు ||ఈలాటి|| 
                                    - రావూరి రంగయ్య
DOWNLOAD MP3 SONG HERE 👇

20 August 2020

Ee jeevitha eetha | ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

633
ఈ జీవిత ఈత - ఈదలేకున్నాను 
నా చేయి పట్టుకో నా యేసునాధా 
అప: గాలి తుఫానులకు గలిగే తరంగముల
గొట్టబడుచున్నాను గదా నా దేవా 
||ఈ జీవిత||

1.సారహీనమగు సంసారాబ్దిలోన 
సాగలేకున్నాను సాయంబురావా - 
సారాకరుణా రసధారలే నా కొసగుము
సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము
 ||ఈ జీవిత||

2.సంఘ సంబంధముగ శాంతి లేకపోయె
సమానతత్వంబు సమసిపోయె - 
సోదరులే నాకు శత్రువులయ్యిరి
సమాధానము నొసగ సరగున రావా 
||ఈ జీవిత||

3.బయట పోరాటములు - భయపెట్టు చుండెను -   బంధువులందరు బహుదూరులైరి - 
భార్య పుత్రాదులచే బాధలెన్నో గలిగె
బాధలన్నియు బావ బహుత్వరగ రావా
 ||ఈ జీవిత||

4.రాజ్యము పై రాజ్యంబు రంకె వేయుచుండె-
రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండె - 
రాజులకు రాజువై రయమున రావయ్య - 
రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము 
||ఈ జీవిత||

5.సైతాను చెలరేగి సమయం - బిక లేదని -
సింహపురీతిగా గద్దించుచుండె - 
సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి
సమాధానరాజ్యం - స్థాపించరావా 
||ఈ జీవిత||

6.మొదటి జామయ్యెను మీరింక రారయ్యె - 
రెండవ జామున జాడలేదా - 
మూడవ జామయ్యె మీరింకా రారయ్యే
నాలుగవ జామున నడచివస్తున్నారా
 ||ఈ జీవిత||

7.పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ - 
పెండ్లి సంఘము నాత్మయు బిలుచుండె - 
పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను - 
హల్లెలూయ యని ఆనందింతున్  
||ఈ జీవిత||
DOWNLOAD MP3 SONG HERE 👇

12 July 2020

Ee Gudiyandu Praveshimpan | ఈ గుడియందు ప్రవేశింపన్

585
ఆలయ ప్రతిష్ట 
రా - శంకరాభరణం,  తా - ఆది
(చాయ: రండి యుత్సహించి)

ఈ గుడియందు ప్రవేశింపన్ - యేసుని బిలువగ రారండి = ఆయన రానిదె దీవెనలు - ఆశీర్వాదము లరుదగును ||ఈగుడి||

1.ఆకా శము మనదేవునికి - అత్యున్నత సింహాసనము = పాదములకు యీ - భూమియును - పీఠముగా నొప్పును సుమ్ము ||ఈగుడి||

2.ఆయన సన్నిధి కాంతియే యీ - ఆలయమంతట నిండుకొనన్ = ఆయన యాత్మ సహాయమున - ఆరాధనలను జరుపుటకై ||ఈగుడి||

3.నిర్మలమైన సువార్తను బో - ధింపగ సాయము జేయుటకు = బోధకులైన సువార్తికుల - బోధను నాటగ జేయుటకు ||ఈగుడి||

4.ప్రార్థన విశ్వాసాయుతమౌ - భక్తిని నేర్పెడి నిలయముగ = భక్తులు దేవుని సన్నిధిలో - బాగుగ స్థిరపడ జేయుటకు ||ఈగుడి||

5.ఈ పట్టణమున వెలుగుటకు - ఈ ప్రజలందరి రక్షణకు = ఈ గుడి యీ సభ బలపడుచు - సాగుచు వృద్ధిని జెందుటకు ||ఈగుడి||

6.బాప్తిస్మము నిర్ధారణలు - ప్రభు భోజన సంస్కారములు = బాగుగ జరుగుచుండుటకు - భక్తిని పెంపొందించుటకు ||ఈగుడి||

7.తండ్రి కుమార శుద్ధాత్మలకు - తావుగ నీ గుడి యుండుటకు = త్ర్యేకుని దీవెన వర్షములు - దీనిపై నిరతము కురియుగాక ||ఈగుడి||
- పి.ఎం. రఫాయేలు 
DOWNLOAD MP3 SONG HERE 👇

Ee sayam kalamuna | ఈ సాయం కాలమున

53
సాయంతన ప్రార్థన
రా – కాంభోజి,  తా – ఆది

  ఈ సాయంకాలమున - యేసు ప్రభో వేడెదము = నీ సుదయారస మొల్క - నిత్యంబు మముగావు ||మీ||

1.చెడ్డ కలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో - బిడ్డలము రాత్రిలో - భీతి బాపుము తండ్రీ ||ఈ||

2.దుష్టుండౌ శోధకుని - ద్రోక్కుటకు బలమిమ్ము =  భ్రష్టత్వమున మేము - పడకుండ గాపాడు ||ఈ|| 

3.నీ యేక పుత్రుండౌ - శ్రీయేసు నామమున = సాయం ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా ||ఈ|| 

4.జనక సుత శుద్ధాత్మ - ఘన దేవా స్తుతియింతుం =  అనిశము జీవించి - రా - జ్యంబు జేయు మామేన్ ||ఈ|| 
                                  - మల్లెల దావీదు
___________________________________
Ee sayam kaalamuna - yesu prabho vededamu = Nee sudayarasa molka - nithyambu mamu gaavu ||mee||

1.Chedda kalal rakunda - naddaginchumi prabho = Biddalamu raathrilo - bheethi bhapumu thandri ||Ee||

2.Dushtundau shodhakuni  - drokkutaku  bhalamimmu = Brashtathvamuna memu - padakunda gaapadu ||Ee||

3.Nee yeka puthrundau - Sri yesu naamamuna = Sayam prardhana lella - saraga naalinchuma ||Ee||

4.Janka sutha shudhathma - Ghana Deva sthuthienthum = anishamu jeevinchee - ra - jyambu jeyu maamen ||Ee||
                              - Mallela Daveedu
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...