Showing posts with label Viduvaledennadu neevu na cheyi. Show all posts
Showing posts with label Viduvaledennadu neevu na cheyi. Show all posts

19 October 2022

Viduvaledennadu neevu na cheyi | విడువలేదెన్నడూ నీవు నా చేయి

విడువలేదెన్నడూ నీవు నా చేయి 
మరువలేదెన్నడూ నన్ను నీ కృప (2)
యేసయ్యా ... రక్షణ ప్రాకారమా ... 
యేసయ్యా ... నాకున్న ఆధారమా (2) 

నా గుడారముపై నీ దృష్టిని నిలిపి 
ప్రతి శాపమును తొలగించినావు 
పరలోక సంపదలు సమృద్ధిగా నింపి 
ఆశీర్వదించి హెచ్చించినావు (2)
నీ సరిహద్దులను నే దాటిపోకుండా - నీ పాదసన్నిధిలో నను నిలిపినావు (2) ||విడువ|| 

నీవుండు స్థలములో నేనుండాలని 
పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో 
మలిన వస్త్రములు తీసివేసి 
రక్షణ వస్త్రములు తొడిగించినావు (2)
అర్హత లేకున్నా నీ సేవ కొరకు - యాజక వస్త్రములు ధరింపచేసితివి (2) ||విడువ||  

ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద 
దాచియుంచితివి ఈనాటి వరకు 
నీ మందిరములో పూర్ణ హృదయముతో
ఆరాధించుటకు ఆత్మతో నింపితివి (2)
నీకు విరోధముగా రూపించే - ఏ ఆయుధము వర్ధిల్లదంటివే (2) ||విడువ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...