Showing posts with label 297 యేసు క్రీస్తుని గొల్వ రన్న. Show all posts
Showing posts with label 297 యేసు క్రీస్తుని గొల్వ రన్న. Show all posts

07 April 2024

Yesu kreestunii golva యేసు క్రీస్తుని గొల్వ రన్న

297
యేసు క్రీస్తును కొలుచుట
రా - ముఖారి, తా - ఆది 

యేసు క్రీస్తుని గొల్వ రన్న - యీ జగతిలోన - నెవ్వరు లేరు వాని కన్న = యేసుని వాక్యము - ఎవ్వరి కబ్బునో - దోసము విడి పర - వాసము దొరకును ||యేసు||

1.సత్యుఁడు నిత్యుఁడాయ నన్న - యీ సర్వ సృష్టిఁ - జక్కఁగ సలిపి నిలిపె నన్న = వ్యత్యాసము లే - మియు లేకుండఁగ - సత్యుండు చేసెను - సర్వజగం బును||యేసు||

2.నిరాకారుఁడు నిశ్చయుఁడన్న - నరుల రక్షింప - నరావతారుఁడై నాఁడన్న = నరుల పాపములుఁ - పరిహరించుట - కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు||

3.పరిశుద్ధవంతుఁ డాయ నన్న - ప్రభు యేసు నందఁ - పాపమే గానఁ బడుట సున్న = పరులను గావను - ధరలోఁ దిరిగెను - నరుల నడుమ బహు - నిరపరాధముతో ||యేసు||

4.భేదాభేదములు గాని బోధ - నాధుఁడొనరించె - సాధు లెల్లను సంతోషింప = బాధలుఁబడు స - ద్రిక్తులతోడను - సాదర వాక్కులు - జక్కగ పలికెను ||యేసు||

5.మహిలోన మనుజు లెవ్వ రైనఁ - జేయ లేనట్టి - మహిమాద్బుతములఁ జేసె నన్న = మహా రోగులను - మఱి మృతులను - మహా మహుండు స్వస్థుల - మఱి గావించెను ||యేసు||

6.వర్ణింప వలనుకాని వాఁడు - మన కోసర మతడు - మరణమై మరల బ్రతికినాడు = పరలోకమునకు - మరి వేంచేసిన - పరుఁ డగు క్రీస్తుని - పాదముఁ బట్టుము ||యేసు||

7.పరిశుద్ధ దూతల నాదముతో - ప్రభు యేసు క్రీస్తు - ప్రకాశ వస్త్ర మహిమలతోఁ = పరమునుండి బహు - త్వరగా వచ్చును -- ధరలో నమ్మిన - నరులను బ్రోచును ||యేసు||

8.న్యాయంబు దీర్చు దినము గలదు - నమ్మని వారెల్ల - సాయంబు వెదకినను గనపడదు = సువార్త న్యాయముఁ దీర్చును - నడవడి చొప్పున - నమ్మని పాపుల - నరకము జేర్చును ||యేసు||

9.నమ్మండీ నష్టము నొందక - యేసుని నమ్మిన - పొమ్మని చెప్పఁడు సుమ్మండి = ఇమ్ముగఁ గృపతో - నిలలోఁ గాచును - పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును ||యేసు||
- గొల్లపల్లి నతానియేలు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...