బలశూరుడా.. యేసయ్యా నా తోడై - ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు (2) ||నీవేనా||
1. త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువైయుండగా -
నిజస్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం - శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవేనా||
2. వేదన కలిగిన దేశమందు - వేకువ వెలగై నిలిచినావు - విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసన మిచ్చినావు (2)
మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవేనా||
3. నిర్జీవమైన లోయయందు - జీవాధిపతివై వెలసినావు -
దీనశరీరం మహిమశరీరముగా నీ వాక్కుతో - మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లెలూయా .. హల్లెలూయా .. నీవే రారాజువు
హొసన్నా .. హోసన్నా ... నీవే రారాజువు(2) ||నీవేనా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment