Hosanna Ministries 32nd Album [ Srikaruda Naa Yesayya ] Song - 6 - " అతిసుందరుడవు " Athisundarudavu
అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2)
హల్లెలూయ.. హల్లెలూయ.. హోసన్నా. ఆరాధన (2)
1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు - కృపాక్షేమములు నీ మందిరములో - సమృద్ధిగా కలవు (2)
నే దీనుడనై నీసన్నిధిని అనుభవించెను (2)
పరవశించి..పరవళ్లు తొక్కి.. ఆరాధించెదను (2) ||అతి||
2. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించి యున్నావు (2)
విశ్వాసముతో ఓర్పు కలిగి - వాగ్దానము నే పొందెదను (2)సంపూర్ణతకై.. పరిశుద్ధుడనై.. ఆరాధించెదను (2) ||అతి||
3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు - పునాదులుగల పట్టణములు కట్టుచున్నావు (2)
సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు (2)
నీ మహిమనుపొంది.. నీ దరిచేరి.. ఆరాధించెదను (2)
అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2)
ఆరాధనకు నీవు యోగ్యుడవు స్తుతులకు నీవె పాత్రుడవు
No comments:
Post a Comment