యెహోవా రాఫా స్వస్థపరచు దేవా
నీ సన్నిధి చేరితిని నన్ను కరుణించి బ్రోవుమయా (2)
బలహీనమైన ఈ దేహము -
బలమైన నీ కరములతో (2)
బలపరచుము నేడు -
ఘన పరచెద నీ నామము (2) ||యెహోవా||
నీ నామమందు మనుజులకు -
నీతి సూర్యుని ఉదయముతో (2)
ఆరోగ్యము మా కొసగి -
ఆనందము నీయుమయా (2) ||యెహోవా||
No comments:
Post a Comment