211 I am coming to the Cross
సిల్వయొద్దఁ జేరుదున్ -
బీద హీనయంధుఁడన్
లోకమున్ త్యజింతును -
పూర్ణముక్తి నొందుదున్
||కర్త, నిన్నె నమ్ముదున్
కల్వరీ గొఱ్ఱెపిల్లా
మోకరించి వేఁడెదన్
నన్నుఁ గావుమో ప్రభో!||
1. నిన్ నేఁజేరఁ గోరఁగా -
నన్ను ఁబాయు పాపము
శుద్ధిఁజేతునంచును -
యేసు మాటనిచ్చెను.
2. నన్ను ను నా మిత్రులన్ -
లోక యాస్తిఁ గాలమున్
దేహయాత్మయంతయు -
నీకర్పింతునిప్పుడు.
3. యేసుమాట నమ్మెదన్ -
క్రీస్తు రక్త పుణ్యముఁ
జూచి మ్రొక్కి యేసుతో -
నేను మృతినొందితిన్.
4. యేసు తాను వచ్చును -
నాకు నిచ్చు పూర్ణతన్
శుద్ధ సౌఖ్య మొందుదున్ -
జయస్తోత్ర మేసుకు.
- డబల్యు. మెక్ డోనాల్డ్
అను: జే. అబెర్లీ
No comments:
Post a Comment