160
క్రీస్తును గూర్చి ప్రవచనములు
రా - పంతురాళీ, తా - అట
(ఛాయ: ఇడుగో గొఱ్ఱెల కాపరి)
ఇదిగో శుభద రక్షణము - దేవుఁడు పంపె - నిదిగో శుభద రక్షణము = ¹సదమలంబగు పూర్వ - సత్యవాక్యమునందు - మృదువుగా దీర్ఘ ద - ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో||
1.²అలపిశాచముతోడను - దేవుఁడు తొల్లిఁ - బలుకు వాక్యము జాడను = ³పొలతి సంతతి నిన్ను - తలఁగొట్ట బుట్టునని - తెలియఁజేసెను మోషె - దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||
2.ఘన దివ్య బలిచేయను - పాపములెల్లఁ - ⁴దునిమి పుణ్యము లియ్యను = ⁵ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని - మును దానియేలు బ - ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో||
3.యూద రాజ్యములోపట - బెత్లేమనెడి - యూరఁ గ్రీస్తుడు బుట్టుట = ఆదిలోన మీకా - యను దీర్ఘ దర్శిచే - మోదమునఁ దెల్పబడె - ముందు వేదమునందు ||ఇదిగో||
4.మన దోషముల కొఱకునై - యేసుని కాయ - మది గాయముల ⁶హ్రస్వమై = మన రక్షకుని పాట్లు - గనినట్టుల యెషయ్య - మును దెల్పె దీర్ఘద - ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో||
- పురుషోత్తమ చౌదరి
------------------------------------------------
¹మిక్కిలి పరిశుద్ధమైనది. ²ఆ. ³స్త్రీ. ⁴నాశనము చేసి. ⁵చక్కగా. ⁶క్షీణించి.
No comments:
Post a Comment