Drakshavallini nenu | ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు

159
ద్రాక్షావల్లి, తీగెలు
రా - శంకరాభరణం, తా - ఆది
(ఛాయ: సర్వలోకములార)

ద్రాక్షావల్లిని నేను - ద్రాక్షాతీగెలు మీరు = అక్షయు డేసిటు బలికె అతిముదమునను వినరండి ||ద్రాక్షా|| 

1.నాయందుండని తీగె - నాశనమొందును నిజము =  నాశనమొందక మీరు - నాయందుండుడి ఫలియింపన్ ||ద్రాక్షా|| 

2.ఫలముల నివ్వని తీగె - పనికిరాదని నరికి = పారవేయంబడును - నిరతము తధ్యము నిప్పులలో ||ద్రాక్షా|| 

3.ఫలించు ప్రతి తీగె - ఫలముల పెక్కుగ నివ్వన్ = పరిశుద్ధి చేయబడున్ - యెఱుగరే మీరది అనవరతం ||ద్రాక్షా|| 

4.నాయందుండినగాని - నయమగు కాపుండదిలన్ =  నాయందుండిన వాడు - నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా|| 

5.మీరు యేదియు చేయ - లేరు నాకు వేరై = వేరుగ మీరుండినచో - వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా|| 

6.కాన యేసుని యందు - మానకనుందుము స్వేచ్ఛన్ =  మాన్యుడేసుని పలుకుల్ - మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా||
- ఎం. జే. రామంజులు

No comments: