01 February 2021

Ninne Ninne Nammukunnanayya | నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా 
నన్ను నన్ను వీడి పోబోకయ్యా 
నువు లేక నేను బ్రతుకలేనయ్యా 
నీవుంటే నాకు చాలు యేసయ్యా 

కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా 
కారు చీకటులే నన్ను కమ్మినా 
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా 

చేయని నేరములంట కట్టినా 
చేతకాని వాడనని చీదరించినా 
చీకుచింతలు నన్ను చుట్టినా 
చెలిమే చితికి నన్ను చేర్చినా

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...