Mayalokam Mayalokam | మాయలోకం మాయలోకం తెలుసుకో

మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్థం తెలియని లోకం తెలుసుకో ఇది యౌవన మైకం 
కొంపముంచును నీ అమాయకం 
                                           ||మాయలోకం||
ఎవడో నవ్వాడని అదియే ఆ ప్రేమయని(2) 
అందంగా వున్నాడని అన్నీ తెలిసిన వాడని 
మాటల మాయలో మలినమై -
పాటల పార్కులో పతనమై (2) 
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా 
                                         ||మాయలోకం||
ఎక్కడో అమ్మాయిని చూసి- అక్కడే తన మనసిచ్చేసి(2) అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడిచి 
ప్రేమ ముసుగులో అంధుడవై -
కామ క్రియలలో బంధియై (2) 
ఆ సంసోనులా చంపుకొందువా ఓ సోదరుడా
                                       ||మాయలోకం||

No comments: