విజయశీలుడా నాప్రాణ ప్రియుడా -
కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా -
నా కార్యములన్నియు సఫలముచేసితివి (2) ||విజయ||
1.అలసిన సమయమున -
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి -
ధైర్యముతో నింపినావు
అలసిన సమయమున -
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి -
ధైర్యముతో నింపినావు
నిత్యానందము కలిగించే -
నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి (2) ||విజయ||
2.ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి -
విడుదల కలిగించినావు (2)
అరణ్యమార్గమున విడువక తోడై -
విజయముతో నడిపినావు
ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి -
విడుదల కలిగించినావు
అరణ్యమార్గమున విడువక తోడై -
విజయముతో నడిపినావు
నీ స్వాస్థ్యమును తండ్రిగ నిలిచి -
వాగ్దానభూమిలో చేర్చిన దేవా (2) ||విజయ||
3.ఆరోగ్యకరమైననీ రెక్కల నీడలో -
ఆశ్రయమిచ్చితివి నాకు (2)
అక్షయుడా నా సంపూర్ణతకై -
మహిమాత్మతో నింపినావు
ఆరోగ్యకరమైననీ రెక్కల నీడలో -
ఆశ్రయమిచ్చితివి నాకు
అక్షయుడా నా సంపూర్ణతకై -
మహిమాత్మతో నింపినావు
నిత్యము నీతో నేనుండుటకై -
నూతన యెరూషలేం నిర్మించుచున్నావు ||విజయ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment