31 December 2025

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Naa brathuku dinamulu

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము 
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము 
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము 
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు||

ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి 
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని 
ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని 
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని 
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు 
మరల నన్ను నూతనముగ చిగురు వేయని || నా బ్రతుకు||

నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి 
నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చెను 
నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది 
దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము 
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును 
విశేషముగా రూపించుము నా శేష జీవితం || బ్రతుకు||నా బ్రతుకు||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...