07 March 2023

Nenu nammukunn na lyrics | నేను నమ్ముకున్న నా దేవుడు

నేను నమ్ముకున్న నా దేవుడు - ఎన్నడూ నా చేయి విడువడు (2)
నా దేవుడు - సజీవుడు - నా విమోచకుడు బలవంతుడు (2) ||నేను||
 
1.నా పక్కన వెయ్యి మంది పడినను - 
నా కుడి ప్రక్కన పదివేలు కూలీనను (2)
ఏ అపాయము.. నా దరికి చేరదు (2)
నన్ను కాపాడు నా దేవుడు - కునుకడు.. ఎన్నడూ.. నిద్రపోడు (2)
కునుకడు.. ఎన్నడూ.. నిద్రపోడు ||నేను||
 
2.శోధనలు నన్ను చుట్టి ముట్టినను - 
వేదనలు నన్ను కృంగదీసినను (2)
కలత చెందను.. నే కలవరపడను (2)
యుద్ధ శూరుడైన నా దేవుడు - 
నా శ్రమలో ఆశ్రయమై నిలుచును (2) 
నా శ్రమలో..ఆశ్రయమై.. నిలుచును ||నేను||
 
3.నా దేవుడు నన్ను మరిచినాడని- 
నా దేవుడు నన్ను విడిచినాడని (2)
నేను తలచగా.. ప్రభు చెంత నిలువగా (2)
మరణ లోయలో నే.. నడిచినా - 
ప్రభు నాతో నుండగా నే చావను (2)
ప్రభు నాతో నుండగా నే చావను ||నేను||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...