20 December 2022

Raraju puttadoi lyrics | రారాజు పుట్టాడోయ్ మారాజు


రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్

ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్

నింగి నేల పొంగిపోయే, ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్...

వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు

కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ

సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై...

మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు

ప్రేమ పొంగు సంద్రమల్లే, కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా

సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై...

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...