152
యేసు క్రీస్తు ప్రత్యక్షత
(ఛాయ: యెహోవా భజన,చేయండి)
రా – నాదనామక్రియ, తా – ఆది
కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య - జనులకు గల్గిన, విధమెట్లొ తరచి ||కనరె||
1.నక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి - రక్షకుని జూచిరి - రక్తిమీరంగ = కాంక్షతో ప్రభునికి మ్రొక్కి - కాన్కల్ - కాంతిమీరగ నిచ్చి - తరలిరి పరగన్ ||కనరె||
2.పదియు రెండేడ్ల, ప్రాయమున - ప్రభువు - పస్కాపండుగునకు - పరగబోయెనుగ = ముదమొప్ప దేవాలయములో - జేరి - ముద్దుగ బోధించె - బోధకులకును ||కనరె||
3.కానాయూరి పెండ్లికరిగి - ప్రభువు - ఘనముగ నీళ్లు ద్రాక్షా - రసముగజేసెన్ = తనరమహిమను బయలుపరచి - శిష్యుల - మనములబలపర్చె - ఘన విశ్వాసమున ||కనరె|
4.కుష్థరోగి యొకడువచ్చి తనదు - కుష్ఠరోగము బాప - ప్రభునివేడంగ = ఇష్టబుద్ధితో ప్రభువువాని - ముట్టి కుష్ఠురోగము బాపె - కోర్కెలూరంగ ||కనరె||
5.శతాధిపతి విశ్వాసమును - ప్రభువు - తరచి చూచి మెచ్చి - దయజూపె గనరె = హితవుగవాని - దాసుని - పక్ష - వాతంబు స్వస్థత మరిగావించెనుగ ||కనరె||
6.గాలివానల విప్లవంబు - ప్రభువు - గద్దించి - సద్దణిపి - ఘనమహిమజూపె = గాలిసంద్రముపైన హక్కు - ప్రభునికి - గలదంచు శిష్యులు - ఘనపరచిరిగ ||కనరె||
7.ఇట్టిశక్తిగల ప్రభుని - మనము - గట్టిగనమ్మిన - గలుగు రక్షణము = పట్టువీడక ప్రభునినెపుడు - గుల్పి - పరమశాంతిని బొంది - మరివెలుగగలము ||కనరె||
– తూలూరి ప్రకాశము
No comments:
Post a Comment