1.జనముల శబ్దము జలముల శబ్దము - బలమైన ఉరుములతో
కలసిన స్వరము - నిలచిన యేసు - పిలచిన పిలుపును నీ వింటివా
2.ఏదేను తోటలో ఆదాము చెడగా - ఆదేవుడే పిలచె
ఆదాము ఎదుటకు అరుగాక దాగిన - అటులానె నీవును దాగేదవా
3.పనులను వదలి జనులను విడచి - నను కనుగొను మనగా
కనిపెట్టి నందున ఘనుడబ్రహాముకు - కనిపించె మన కన్నతండ్రి యేసే
4.ఆనాడు దేవుడు మోషేను పిలువగ - ఆలకించెను స్వరము
ఈనాడు నీవును ఈ స్వరము వినగా - కానాను చేరగ కదలిరావా
5.ఆ రీతిగానే సమూయేలు వినగా - ఆశీర్వాద మరపె
ధారాళముగను పరమ వరుని - దరి జేరుకొని నీవు సేవించుమా
6.సౌలా సౌలా నన్నేల హింసింతువు - చాలించుమనె స్వరము
సౌలాధిపతి నంత సంధించగానే - సద్భక్తుడై పౌలుగా మారెగా
7.స్వరమును వినగా పరమార్థజ్ఞాని - స్థిరుడైన యోహాను
పరమ మర్మాలు భవిష ద్విషయాలు - ప్రకటించే ప్రతిరోజు స్మరియించుమా
No comments:
Post a Comment