దీన మనసుతో - నిన్ను కొలుతుమయ్యా (2) ||ఎనలేని||
1. నీ నామ గానం మాకెంతో ముదము - నీ ప్రేమ వాత్సల్యం మాకెంతో ప్రియము (2)
నీ కార్యములే ఆశ్చర్య కార్యములు - నీ తలంపులే మాకెంతో మధురం (2) ||ఎనలేని||
2. మా ఉన్నత దుర్గము మాదేవుడే - మేమాశ్రయించిన మా శైలము (2)
మా దీపమును వెలిగించువాడు - మా దేవుడే మాకు వెలుగు (2) ||ఎనలేని||
3. సన్మార్గమందు నడిపించినావు - దుర్మార్గులందరిని రక్షించినావు (2)
దరిచేరి నమ్మిన దీనులందరిని - నీ ఆత్మ ద్వారా నడిపించినావు (2) ||ఎనలేని||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment