Vishwasamutho vededi | విశ్వాసముతో వేఁడెడి

388
విశ్వాస ప్రార్థన
(ఛాయ: మనసానందము) 
రా - సౌరాష్ట్ర,  తా - ఆది

విశ్వాసముతో - వేఁడెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును = శాశ్వత రాజ్య - థీశ్వరుఁ డాఢ్యుఁడు -  శాశ్వత మగు నీ - శాసన మె చ్చెను ||విశ్వా||

1.బిడ్డలు తండ్రుల - వేడఁగ నన్నము - బెడ్డ లిచ్చు వె - ఱ్ఱులు గలరే = దొడ్డ తండ్రి నిలఁ - దోడ్పా టడిగిన - నడ్డులేక విమ - లాత్మ నొసంగును ||విశ్వా||

3.నమ్మకమునఁ జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో = ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||

4.వెతకెడు వారికి - వెసఁ గృపఁ జూపును - గతిఁ గని వేడం - గాఁ దెర చున్ = సతతము యేసుని - చక్కని పేరట - హిత మతి వేఁడగ - నెంత యు మేలగు ||విశ్వా||

5.బల మేమియుఁ గనఁ - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు = నలయకు నేలను - నావగింజ మరి నిలిపినఁ జెట్టయి - నింగికి నెదుగదె ||విశ్వా||

6.అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా = భువిఁ బాపాత్ములఁ - బ్రోచెడు ప్రభు కృపఁ - జవిఁ జూడుము నుతి - సల్పుచు వేగమే ||విశ్వా|| 
                          – ఎ. జెకర్యా

No comments: