Yesunaadhuni siluvapaini vesi | యేసునాధుని సిలువపైని వేసి శ్రమ

194   
యేసు పై మన దోషము మోపబడిన
రా- సావేరి తా-ఆది 
(చాయ: ఎందుకే నా డెందమా)

యేసునాధుని సిలువపైని - వేసి శ్రమఁబొదించినది నా - దోసమే - దుస్సహ - వాసమే ||యేసు||

1.¹కంటక కిరీట ²మౌదల - నంటగొట్టించినది నాచెడు - తలఁపులే - పాపపు పలుకులే ||యేసు||

2.మృదుకరంబుల మేకులందింపి - నదితలఁప నా హస్తకృత కా - ర్యంబులే దుష్క - ర్మంబులే ||యేసు||

3.పాదయుగమున నాటిచీలలు - బాధ నొందించినది నా చెడు - నడకలే - దోసపు - పడకలే ||యేసు||

4.దాహముం గొనఁజేదు చిరకను - ద్రావదలఁచినది మధుపానా - సక్తియే - యందను - రక్తియే ||యేసు||

5.హెచ్చుగ లోహిత పతనముగఁ - గ్రుచ్చిన కుంతంబు నా పా - పేచ్ఛలే - హృదయదు - రేచ్ఛలే ||యేసు||

6.పావనగాత్రంబు క్షతమయ - మై వెతలపాల్జేసినది నా - దేహమే - యఘ సం - దోహమే ||యేసు||

6.దీనిఁగని నా మానసాబ్జము - లోని కలుషము దూరపర్చక - నడుతునా - ధారుణిఁ - గడుతు నా ||యేసు||
 – జుటిక దావీదు
____________________________
¹ముండ్ల, ²తల

No comments: