Adhigadhigo alladhigo kalvari | అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు

అదిగదిగో అల్లదిగో - 
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||

1. గెత్సేమను ఒక తోటదిగో - 
ఆ తోటలో ప్రార్ధన స్థల మదిగో (2)
అచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో||

2. శిష్యులలో ఇస్కరియోతు - 
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో||

3. లేఖనము నెరవేరుటకై - 
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో||

4. చలి కాచుకొను గుంపదిగో - 
ఆ పేతురు బొంకిన స్థల మదిగో (2)
మూడవ సారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకో యను కూతదిగో (2) ||అదిగదిగో||

5. యూదుల రాజువు నీవేనా - 
మోదముతో నీవన్నట్లే (2)
నీలో దోషము కనుగొనలేక (2)
చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో||

6. గొల్గొతా స్థల అద్దరిని - 
ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో||

7. గొల్లున ఏడ్చిన తల్లదిగో - 
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో||

8. దాహము గొనుచున్నాననుచు - 
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||

No comments: