09 November 2021

కాల్చబడని విశ్వాసం

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪ నేటి దిన ధ్యానము⛪

 ✝️*కాల్చబడని విశ్వాసం*✝️
 
మేము సేవించుచున్న దేవుడు మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు. 
 దానియేలు 3:17

మనం నడిచేటప్పుడు చిన్న ఎదురుదెబ్బ తగిలితే చాలు దేవా ఈ దెబ్బ నాకెందుకు తగిలింది అంటాము. అగ్ని గుండం లో వేసిన మమ్ములను రక్షించగల సమర్థుడు మా దేవుడు అని నిశ్చలమైన భక్తితో సేవించు నా భక్తులను చూస్తున్నాము.అదే మనమైతే దేవుడు రక్షించక పోతే మనము కాలిపోతామేమో అని సందేహించక నా దేవుడు నాకు సమస్తము ఇచ్చే దేవుడు అని నమ్మినట్లయితే విశ్వాసముంచితే, నీ విశ్వాసమే నిన్ను కాపాడి ఆ దినం దానియేలును అతని స్నేహితులను అతని రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వారి వలే నీ విశ్వాసాన్ని నీవు బలపరచుకొని నా దేవుడు ఏదైనా చేయగల సమర్ధుడు అని దృఢంగా నమ్మి ఆయన బిడ్డగా జీవించాలి.

🛐 *ప్రార్థన*🛐
నా తండ్రి! అగ్ని గుండములో కూడా కాల్చబడిన విశ్వాసము కలిగియున్న యవ్వన బిడ్డల వలె నా విశ్వాసం కూడా ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...