21 October 2021

సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును. ఎస్తేరు 4:14

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం..🙏.
⛪నేడు దిన ధ్యానము⛪
✝️*దేవునిలో నీకు విడుదల* ✝️

సహాయమును విడుదలయు 
మరియొక దిక్కునుండి వచ్చును. 
ఎస్తేరు 4:14

ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఒక్కొక్క సమయంలో ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, సామాజిక పరంగాను, నాశనకర పరిస్థితులు రావచ్చు. ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేని పరిస్థితులు నీకు కలుగవచ్చు. అయిననూ నీవు నమ్ముకున్న వాడు వాటిని అన్నింటిలో నుంచి నిన్ను బయటకు తీసుకు రాగలరు సమర్ధుడు అని నీవు నమ్మి నీ ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడు తప్పక వస్తాడు. నువ్వు యదార్థంగా చేసిన ప్రతి ప్రయత్నాల బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రయత్నాలను చేయక వదిలివేసిన వాటిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఎందుకు నాపై ఆధారపడి లేకపోయావు  అని వాక్యం ద్వారా నిన్ను ప్రశ్నిస్తారు. ఏ పనైనా యధార్ధముగా నీ ప్రయత్నం లోపము లేకుండా చేస్తూ దేవుని పై ఆధారపడి నట్లయితే నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, దేవుని యొక్క హస్తం నీకు అందించి పైకి తీసుకు వస్తాడు. ఏ దిక్కు నుంచి మీకు సహాయం వస్తుందో ఊహకు అందదు అటువంటి సహాయాన్ని విడుదలను దేవుడిని కలుగజేస్తాడు. ఏ విధంగా తను నమ్మిన ప్రజల దేవుడు కాపాడుతాడు అని మౌనంగా ఉండి గోనెపట్ట కట్టు కొని తన ప్రయత్నాలు చేశాడు అదేవిధంగా మౌనంగా దేవుని దగ్గరకు వెళ్ళినట్లయితే వెంటనే దేవుడు నీకు విడుదల చేసి నేను ముందుకు నడిపిస్తాడు.

 🛐*ప్రార్ధన*🛐
ఓ దేవా నాకు ఎదురవుతున్న శ్రమల నుండి శోధనల నుండి విడుదల కలిగించి నీకు మహిమకరముగా నడిపించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్!

👉నేను అన్ని దేవుళ్ల ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటున్నాను; మిగిలినవన్నీ కేవలం వివరాలు. - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...