27 October 2021

నిత్యము ఆయనను ఆశ్రయించాలి

🙏ప్రభువు నామములో శుభోదయం..🙏.
⛪నేడు దిన ధ్యానము:-⛪

 ⛪*నిత్యము ఆయనను ఆశ్రయించాలి*⛪

నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
 కీర్తనలు 31:19

ఆదినుంచి అంతవరకు పాప విముక్తి మరియు రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేవి. దీనికి మంచి పనులతో, పుణ్యము తోను సంబంధ మేమి లేదు. దేవుడు సిద్ధపరచే మేలు గొప్పది. నీ విషయంలో దేవునికున్న ఘనమైన సంకల్పం గొప్పది. ఇది నీకు ఏమేమి తెస్తుందో ఎవరైనా కనీసం ఊహించనైనా ఊహించలేరు. ఆయన ఆలోచించ గలిగిన అతి శ్రేష్టమైన దీవెనలూ, వరాలూ, బహుమతులు నీపై వరంలా కురిపిస్తాడు. అంత శ్రేష్ఠమైన దీవెనలు ఇచ్చే దేవునిని నిరంతరం ఆశ్రయించాలి .నీకు ఇబ్బంది,బాధలు కలిగినప్పుడు ఇతరులను ఆశ్రయించుకుని కాదు గాని దేవునిని ఆశ్రయించి ఆయన సంరక్షణను నువ్వు కోరుకుంటే, ఆయన నీకు ఇవ్వాలని సిద్ధపరచిన గొప్ప మేలును నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు మహారాజు నిరంతరం ఆయనే ఆశ్రయము, నా దుర్గము అంటాడు. ఆయనకు బాగా తెలుసు తనను ఆశ్రయించిన వానిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. శారా రాజగృహము లోనికి తీసుకుని పోయినప్పుడు అబ్రాహాము ఎంత ఆందోళనకు గురై ఉంటాడో ఊహించటం కష్టం. రాజమందిరము లోనికి వెళ్ళి తన భార్యను రక్షించుకొనుట అసాధ్యం. దేవుడే స్వయముగా ఆ పరిస్థితిని చక్కదిద్దకపోతే, శారా మరలా అబ్రహము చూసేవాడు కాదు. తన బిడ్డలకు గొప్ప సంరక్షకుడు మన దేవుడు. అటువంటి సంరక్షణ దేవుడు నీకు కలుగజేసి నిన్ను ఆశీర్వదించును గాక!

 🛐*ప్రార్థన* 🛐
ప్రియ ప్రభువా నిత్యము నిన్ను ఆశ్రయించూచు నీ యందు ఆనందించి, ఆశీర్వదించబడు నీ సేవకునిగా నన్ను బలపరచుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్!

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...