19 October 2021

నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. - 1 సమూ. 26:25

🙏ప్రభువు నామములో అందరికీ శుభోదయం.🙏
⛪నేను దిన ధ్యానము:-⛪
 
✝️ *దేవునికి విధేయత కలిగి జీవించుట*✝️

నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక.
1 సమూ. 26:25

దేవుడు మన జీవితంలో ఏ మేలు చేసాడు అనుకునే బదులు నీవు దేవుని పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు అని ఆలోచించాలి. గొర్రెల కాపరి అయిన దావీదు దేవుని యందు మిక్కిలి భయభక్తులు కలిగియుండుట వలన ఆశీర్వదించబడ్డాడు. ఏ మానవుడైన ఘనత పొందుకున్నాడంటే దానికి ముందు వినయము ఉంటుంది.మానవులమైన మనము దేవుని యందు, మనుషులు యందు వినయము కలిగి జీవించాలి. గొర్రెల కాపరి గా ఉన్న దావీదు దేవుని ప్రజలకు రాజైనాడు అంటే అది కేవలం దేవుని పట్ల ఆయనకు ఉన్న వినయము యొక్క ప్రతిఫలము. యదార్థమైన హృదయముతో దేవునికి వినయ విధేయతను కనబరిచాడు. దావీదు వలన మహా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. కనుక మనము కూడా యదార్థమైన హృదయంతో దేవుని యందు యందు, మనుషుల యందు వినయము కలిగి ఉంటే అన్ని విషయాలలో ఆశీర్వాదం పొందుకుంటాము, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయగలుగుతాము. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మహోన్నతుడు పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, అయినను వినయము గల వారి యొద్ద నివశించుట నాకు ఇష్టము.అటువంటి యధార్థమైన హృదయం కలిగియుండటానికి దేవుని యొక్క సహాయము నిరంతరం మనకు కలుగును గాక!

🛐ప్రార్ధన:-🛐
ప్రియ ప్రభువా, నీ యందు వినయవిధేయతలు కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

దేవుని వాగ్దానాలు అన్నీ వినయ విధేయతపై ఉన్నాయి. - ఎల్లెన్ జి. వైట్

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...