23 September 2021

"నా ఆత్మను మీయందుంచెదను".యెహెజ్కేలు:36:27

నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
 ✝️*దేవుని ఆత్మా*✝️

  “నా ఆత్మను మీయందుంచెదను”.  
  యెహెజ్కేలు 36:27. 

మన ప్రతీ రోజూ ఉరుకులు పరుగులతో నడుస్తుంది. కొన్నిసార్లు మనం నిత్యం చేస్తూ ఉండే కార్యములు మన జీవితంలో ఏ మార్పు తీసుకురాక మనలను బాధపెడతాయి. కానీ పరిస్థితులను వేరే కోణంలో చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న మార్పు మన ఆలోచనను మార్చి మనమెన్నడూ ఊహించని రీతిగా మన జీవితాన్ని సానుకూలంగా మార్చవచ్చు.

నిన్ను ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టుచున్న శ్రమలను జయించుటకు దేవుడు మనకు జ్ఞానమిచ్చియున్నాడు. ఈ జీవితంలో నీవు వేదనను, బాధను, నొప్పిని భరించవలసి రావచ్చు. కానీ దేవుడు తన ఆత్మను అనగా ఆదరణకర్తను మనకు అనుగ్రహించాడు. గనుక మనం ఇంక చింతింపనవసరం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ఆయన యందు విశ్వాసముంచి ధైర్యముగా ముందుకు సాగిపోదాము.

🛐ప్రార్థనా:
ప్రియమైన తండ్రి! నీవు నన్ను నడిపించుచున్న విధానమును బట్టి నీకు వందనములు. నేను ఎన్నో చిక్కుల నడుమ ఉన్నా తగిన జ్ఞానమిచ్చి, నీయందు ఆధారపడుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...