16 May 2021

Vinarandi Na Priyuni lyrics | వినరండి నా ప్రియుని విశేషము

వినరండి నా ప్రియుని విశేషము (2)
నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు 
వినరండి నా ప్రియుని విశేషము 
నా వరుడు సుందరుడు మహాఘనుడు 
 
నా ప్రియుని నీడలో చేరితిని - ప్రేమకు రూపము చూసితిని (2) 
ఆహా ! ఎంతో మనసంతా ఇక ఆనందమే 
తనువంతా పులకించే మహదానందమే ||వినరండి||
 
మహిమతో నిండిన వీధులలో - బూరలు మ్రోగే ఆకాశపందిరిలో (2) 
జతగా చేరెదను ఆ సన్నిధిలో 
కురిసే చిరుజల్లె ప్రేమామృతము 
నా ప్రియ యేసు నను చూసి దరిచేరునే 
జతగా చేరెదను ఆ సన్నిధిలో 
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను 
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||

జగతికి రూపము లేనప్పుడు - కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
స్తుతినే వస్త్రముగా ధరించుకొని 
కృపనే జయధ్వనితో కీర్తించెదను 
నా ప్రభు యేసు చెంతన చేరెదను 
స్తుతినే వస్త్రముగా ధరించుకొని 
నా ప్రభు యేసు చెంతన చేరెదను 
యుగమొక క్షణముగ జీవింతును 
 
వినరండి నా ప్రియుని విశేషము 
నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు 
కనరండి నా ప్రియుని విశేషము 
నా వరుడు సుందరుడు మహాఘనుడు
 
తలపుల ప్రతి మలుపు గెలుపులతో 
నిలిచే శుద్ధహృదయాల వీరులతో (2)
ఫలము ప్రతిఫలము నే పొందుకొని 
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను 
ఆ శుభవే నాకెంతో ఆనందమే 
ఫలము ప్రతిఫలము నే పొందుకొని 
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే 
నా ప్రియుని విడువను నేనెన్నడు 
 
వినరండి నా ప్రియుని విశేషము 
నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు 
కనరండి నా ప్రియుని విశేషము 
నా వరుడు సుందరుడు మహాఘనుడు  ||నా ప్రియుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...