Madhurathi Madhuram Yesu | మధురాతి మధురం యేసు నీ నామం

సాకి: మధురాతి మధురం యేసు నీ నామం ... 
అతి శ్రేష్ఠము యేసు నీ నామం...

మధురాతి మధురం యేసు నీ నామం 
నా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామం (2)
                             ||మధురాతి||
అన్ని నామముల కన్నా పై నామం నీ నామం మహిమ గల నీ నామం -
 అతి శ్రేష్ఠము, అతి మధురం (2)
అద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయపరుచు నీ నామం (2)
                             ||మధురాతి||
విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టును మహిమ గల నీ నామం - 
మహిమకు చేర్చు నీ నామం (2)
మరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవమునిచ్చు నీ నామం (2)
                             ||మధురాతి||
                         _ Joshua Shaik
                      _ Swetha Mohan

No comments: