Naa Priyuda Yesayya Nee Krupa | నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే

నా ప్రియుడా - యేసయ్యా 
నీ కృప లేనిదే నే బ్రతుకలేను 
క్షణమైనా - నే బ్రతుకలేను
                              || నా ప్రియుడా || 
1. నీ చేతితోనే నను లేపినావు 
    నీ చేతిలోనే నను చెక్కుకొంటివి 
    నీ చేతి నీడలో నను దాచుకొంటివి 
                             || నా ప్రియుడా || 
2. నీ వాక్కులన్ని - వాగ్దానములై 
    నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి 
    వాగ్దానములు - మార్పు లేనివి
                             || నా ప్రియుడా || 
3. ముందెన్నడూ - నేను వెళ్ళనీ 
    నూతనమైన మార్గాములన్నిటిలో 
    నా తోడూ నీవై - నన్ను నడిపినావు
                             || నా ప్రియుడా || 
4. సర్వోన్నతుడా - సర్వ కృపానిధి 
    సర్వసంపదలు - నేలోనే యున్నవి 
    నీవు నా పక్షమై నిలిచి యున్నావు 
                             || నా ప్రియుడా |

No comments: