ఉత్తేజపరచిన నా యేసయ్యా (2)
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు-
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని - నిను వేనోళ్ళ ప్రకటించెద (2)
1.ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక -
నీతో నడుచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి- నీ కృపచూపితివి (2)
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము -
ఇదియే నా భాగ్యము
||లెమ్ము||
2.శ్రమలలో నేను ఇంత వరకును -
నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవకిరీటము నేపొందుటకే - నను చేరదీసితివి(2)
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత
||లెమ్ము||
2.తేజోవాసుల స్వాస్థ్యము నేను -
అనుభవించుటే నా దర్శనము (2)
తేజోమయమైన షాలేమునగరులో- నిత్యము నిను చూచి తరింతునే(2)
ఇదియే దర్శనము- ఇదియే దర్శనము-
ఇదియే నా దర్శనము
||లెమ్ము||
No comments:
Post a Comment