నీకే స్తోత్రము యేసువా
1. నను గావను నీవే -ఓ యేసా పరలోకంబును
విడచితివా దాసుని రూపంబున - సిల్వపై నీవు
పాపా శాపములు మోసితివా ||తరతరములలోన||
2. నా పాపఋణంబును - ఓ యేసా ఆ కల్వరిగిరిపై
తీర్చితివా అంగలార్పును మార్చి - రక్షణవస్త్రము -
నాకు ధరింప జేసితివా ||తరతరములలోన||
3. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్య
రక్షణ పాత్రను చేబూని - నిత్యము అర్పించెదను
స్తోత్రమును ||తరతరములలోన||
No comments:
Post a Comment