Divinelu sthotrarhuda yesayya lyrics | దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా 
దిగిరానైయున్న మహారాజువు నీవయ్యా
మొదటివాడవు కడపటివాడవు
యుగ యుగములలో ఉన్నవాడవు ||దివినేలు||
 
1.మానక నాయెడల కృపచూపుచున్నావు -
మారదు నీప్రేమ తరతరములకు (2)
మాటతప్పని మహానీయుడవు - మార్పులేనివాడవు 
నీవు చెప్పిన మంచిమాటలు నెరవేర్చువాడవు
నీమాటలు జీవపుఊటలు - నీకృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||
 
2.దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు -
దయనొందిన నీజనుల ముందు నడుచుచున్నావు (2) 
దాటి వెళ్ళని కరుణామూర్తివై - మనవి ఆలకించావు దీర్ఘశాంతముగలవాడవై - దీవించువాడవు
నీ దీవెన పరిమళసువాసన నీఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు||
 
3.సీయోను శిఖరముపై ననునిలుపుటకే -
జేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) 
దివ్యమైన ప్రత్యక్షతతో - నన్ను నింపియున్నావు 
సుందరమైన నీపోలికగా - రూపుదిద్దుచున్నావు 
నీ రాజ్యమే పరిశుద్ధనగరము - ఆ రాజ్యమే నిత్య సంతోషము(2) ||దివినేలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: