Aathma Nadupu ఆత్మ నడుపు

239
పరిశుద్దాత్మకొరకుఁ బ్రార్థించుట 
రా - ముఖారి,  తా - ఆట 
(చాయ:యేసు కరుణ)

ఆత్మ నడుపు సత్యము లోని కిపుడే - ఆత్మ నడుపు = ఆత్మా నీ సాయంబు - నధికంబుగా నిచ్చి - ఆత్మా నందముతో  దై - వారాధనమున ||కాత్మ||
 
1.ఘోర కలుషంబుల - దూరంబు గా దోలి = పారమార్థిక  బుద్ధి గోరు నట్టులను ||ఆత్మా||
 
2.అంధత్వంబు వలన - మందమైయుండు మా = డెందంబు లెల్ల నీ యందు వెలుగుటకు ||నాత్మ||
 
3.నిర్మల  హృదయంబు - నిరతంబు మాకిచ్చి = కూర్మిన్ నీ వరములన్ గూర్చి దీవించి ||యాత్మ||
 
4.సకల మానవులతో - అకలంక శుభవార్త = బ్రకటించు బలజ్ఞాన - నిక రంబు నిచ్చి ||యాత్మ||
 
5.దీవించి పంపు మో - దైవాత్మ మమ్మును = భావజ్ఞాన మొసంగి - ప్రభు సేవలోన ||నాత్మ||
  - తూలూరి కొర్నేలియస్
_______________________________
Athma nadupu satyamulonikipude - athma nadupu = athma nee sayambu - nadhikambuga nichi - athma nanda mutho daivaradhanamuna ||Nathma||

1.Ghora kalushambula - durambuga dholi = paramardhika budhi gorunattulanu  ||athma||

2.Andhatwambu valana - mandamaiyundu maa = dendambu lella nee yandu velugutaku  ||Athma||

3.Nirmala hrudayambu - nirathambu maa kichi = koormin nee varamulan goorchi deevinchi   ||Athma||

4.Sakala maanavulatho - akalanka   shubhavaartha = brakatinchu bala gnana  nikarambu nichi ||Yathma||

5.Deevinchi pampumo - daivaathma mammunu = bhava gnana mosangi Prabhu seva Lona  ||naathma||
    - Tuloori kornelious
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: