ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణముకంటె - బలమైన ప్రేమది
నన్ను జయించిన నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె ||ఆశ్చర్య||
2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె ||ఆశ్చర్య||
౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు ||ఆశ్చర్య||
4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె ||ఆశ్చర్య||
No comments:
Post a Comment