Srushti pitha sarvonnatha | సృష్టిపితా సర్వోన్నతా

447
సమర్పణ
రా - యమునాకళ్యాణి,  తా - అట

సృష్టిపితా - సర్వోన్నతా - సమర్పింతున్ =  సర్వస్వమున్

1.భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే - బలశౌర్యములు నీవే ||సృష్టి||

2.మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ - మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||

3.వెలలేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన దీవెనలు - నీ కరుణా వర్షములు ||సృష్టి||

4.పరిశుద్ధ గ్రంథపు పలుకులు - పాలోక తేనె చినుకులు = ప్రభు యేసుని మాటలు - మా వెల్గు బాటలు ||సృష్టి||

5.మాదంత నీదే మహా దేవా - మా రాజువయ్యా యెహోవా - మా తనువుల్ - మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||

6.మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? = మోక్ష నాధా యేసుప్రభో - అంగీకరించువిభో ||సృష్టి||

7.తండ్రి కుమార శుద్ధాత్ముడా - త్రియేక దేవ స్తోత్రముల్ = దాత వీవే నేతవీవే - దేవాది దేవుండవే ||సృష్టి||
- డి. వి. డానియల్

No comments: