యేసుక్రీస్తు పట్ల మీ ప్రేమ

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం..🙏.
నేడు దిన ధ్యానము:-

✝️యేసుక్రీస్తు పట్ల మీ ప్రేమ✝️

 మీరు నన్ను ప్రేమించిన యెడల  
 నా ఆజ్ఞలను గైకొందురు. 
యోహాను 14 : 15

   కొన్ని సంవత్సరాల క్రితం, “స్కూల్ ఆఫ్ ఎండ్ టైమ్ ప్రవక్తలు” అనే పాఠశాల ఉండేది, ఇది 7 రోజుల ప్రవచనాత్మక పాఠశాల. వారు 7 రోజులు దేవుని సన్నిధిని ఆస్వాదించారు మరియు ప్రవచనాత్మక పరిచర్య గురించి చాలా నేర్చుకున్నారు. తరువాత వారు రైలులో తమ ఊరికి తిరిగి వెళుతుండగా, చర్చి బృందం సరదాగా మాటలాడుతూ, నవ్వుతు 7 గంటల జర్నీని ఆస్వాదిస్తోంది.

   ఈ చర్చి బృందంలో ఒక చెవిటి వ్యక్తి ఉన్నాడు అతని పేరు రాజు. అతను వినికిడి సమస్యను కలిగి ఉన్నాడు కాని, బాగా మాట్లాడగలడు మరియు అతను ప్రవచనాత్మక పాఠశాల నుండి ఎక్కువగా నేర్చుకోలేకపోయాడు. అతను చర్చి బృందం యొక్క సంభాషణ వినడానికి కూడా సాధ్యం అవ్వక, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

కొంతసేపు తరువాత అతను మరొక రైలు వ్యాన్ వద్దకు వెళ్లి, అపరిచితుడితో సంభాషణను ప్రారంభించాడు మరియు ధైర్యంగా యేసు సువార్తను ప్రకటించాడు. ఆ అపరిచితుడు తనకున్న కొన్ని సందేహాలను మరియు సమస్యలును వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు కాని, రాజు తనకున్న వినికిడి సమస్యవల్ల అర్థం చేసుకోలేకపోయాడు. ఎం చేయాలో తెలియక, పట్టు వదలనక ప్రార్థన చేసి దేవుని సహాయం కోరాడు. అప్పుడే అతను తనదగ్గిరవున్న డిక్టా ఫోన్ (రికార్డింగ్ పరికరం) గమనించాడు, అతను ఆ డిక్టా ఫోన్‌లో అపరిచితుడి సమస్యలు మరియు సందేహాలను రికార్డ్ చేసి, హెడ్‌ఫోన్‌ల నుండి గట్టింగా సౌండు పెట్టుకుని వినడం మొదలుపెట్టాడు, కొన్ని సార్లు అవి విన్న తరువాత అపరిచితుడి సమస్యలు మరియు సందేహాలను రాజు అర్థం చేసుకోగలిగాడు.

    రాజు ఆ అపరిచితుడి వద్దకు తిరిగి వచ్చి తన సందేహాలకు, సమస్యలకు సమాధానమిచ్చాడు. అపరిచితుడు, యేసుని అంగీకరించాడు మరియు అతని ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. రాజు చాలా సంతోషంగా భగవంతుడిని స్తుతించాడు.

   అప్పుడు చాలా సమయం నుండి అక్కడే నిలబడి రాజుని గమనిస్తున్న వున్నా చర్చి సమూహం నాయకుడిని రాజు గమనించాడు. రాజు మాట్లాడుతూ, అన్నా, నేను ఆ అపరిచితుడికి సువార్త ప్రకటించాను మరియు అతను అంగీకరించాడు అని చెప్పాడు. చర్చి నాయకుడు నోటా మాటల్లేక, కన్నీళ్లతో కాసేపు అలాగే నిలబడిపోయాడు. తరువాత అన్ని చర్చి బృందాన్ని పిలిచి ఇలా అన్నాడు:

   మనమందరము ప్రవచనాత్మక పాఠశాల నుండి చాలా నేర్చుకున్నాము కాని ఈ రాజు వినికిడి సమస్యవల్ల చాల తక్కువగా నేర్చుకున్నాడు, కానీ అతను మనకన్నా మంచి పని చేస్తున్నాడు. మనము గాసిప్పులు చేస్తున్నప్పుడు, అతను తనకున్న వినికిడి సమస్యను లెక్కజేయక, ఒక అపరిచితుడికి ఎంతో ప్రయాసపడి సువార్తను ప్రకటించాడు. ప్రభువుకు ప్రియా కుమారుడని నిరూపించు కున్నాడు. మనకు మంచి వినికిడి ఉంది మరియు ప్రవచనాత్మక పాఠశాలలో చాలా నేర్చుకున్నాము కాని ఇప్పటికీ మనము వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు.



   నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ చర్చల కంటే చర్యలలో మెరుగ్గా చూపబడుతుంది, మీరు యేసును ఎంత ఎక్కువగా ప్రేమిస్తే, ఆయన కోసం అంత ఎక్కువగా పని చేస్తారు.
– రాజు

🛐ప్రార్థన:🛐
తండ్రీ, మీరు నా కోసం చేసినట్లు నా జీవితాన్ని మీ కోసం ఉపయోగించుకోవడంలో నాకు సహాయపడండి. యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి ఆమేన్.

No comments: