నిశీధి రేయిలో - తారల వెలుగులో
పశువుల శాలలో - యేసు జన్మించెను
జ్ఞానులు తారను వెంబడించి
గొల్లలు దూతను వెంబడించి
కానుకలు అర్పించిరి - స్తుతులను చెల్లించిరి
మన హృదయమును అర్పించుదము
యేసుని జన్మమే త్యాగము - యేసుని జీవితమే అర్పణము
పరలోకమును విడచి - సింహసనమును వదిలి
మన కొరకే జన్మించెను ||నిశీధి||
Bridge:
సర్వోన్నత స్థలములలో దేవునికి - మహిమ కల్గునుగాక
తనకిష్టులైన వారికి సమధానము - కల్గునుగాక
No comments:
Post a Comment