Meriseti taarala nanu veliginchu మెరిసేటి తారలా నను వెలిగించు


మెరిసేటి తారలా నను వెలిగించు 
కురిసేటి జల్లులా నను దీవించు 
నా ఊపిరివై నా జీవితమై 
నా ఊపిరివై నా జీవితమై 
నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై

1. నీ కనులే నా మనసే తేరిచూడగా 
నాలోనా ఏ మంచి కానరాదుగా 
నీ కృపలో నా గతమే చూడలేదుగా 
సరిచేసి నడిపించు నీదు సాక్షిగా 
నీతి సూర్యుడా, నాదు యేసయ్య 
జీవితాంతము, జాలి చూపవా 
నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై

2. నీ మమతే తీయనిదీ మారదెన్నడు 
లాలించే నీ ప్రేమ వీడదెన్నడు 
ఊహలకే అందనిది నీదు కార్యము 
నీ మాటే నాలోన నిండు ధైర్యము 
సర్వశక్తుడా నాదు యేసయ్య 
ఆశ్రయించగా ఆదరించవా 
నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై

No comments: