నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు
నమ్ము నేస్తమా ఇదిసత్యం వీడబోకుమా విశ్వాసం
1.అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు కలుగు చున్నవని తెలిసీ కలత చెందబోకు
నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు
శోధనలో నిన్ను విడిచి పెట్టిపోడు -
కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు - కన్న తండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు ||నమ్ము నేస్తమా||
2.కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు
చీల్చ బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు
చెక్క బడకపోతే శిల శిల్పం కాదు
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు ||నమ్ము నేస్తమా||
No comments:
Post a Comment