Pothondi kaalam pothondi kaalam | పోతోంది కాలం పోతోంది కాలం

పోతోంది కాలం - పోతోంది కాలం - రానంతదూరం ఓ సోదరా 
ఆగాలిపాదం - ఆపేను మరణం - ఎటు నీ పయనం ఓ సోదరీ
చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకే 
చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే 
చాల జాలి చూపె ప్రభువే పిలిచే 
చాలదంటు ఇలలో పరిగెడతావా 
చాలినంత దయతో నీకై నిలిచే 
చాలదంటు కలలో బతికేస్తావా? ||పోతోంది||

ధరలోన విలువైనదేదైన గాని - వేల ఇచ్చి పొందాలిగా
ధర లేని నిమిషాలు ఆ తండ్రి వరమే వేలయేది యోచించవా!
ఉచితముగా పొందిన నీ జీవితకాలము - వ్యర్థముగా గడపడానికా? 
ఉన్నత త్యాగము చేసిన క్రీస్తుయేసు బాటలో - కడవరకు సాగడానికా ? 
చాలు చాలిక - ఊహలలో నిండిన లోకముకే 
చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే 
చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే 
చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే ||పోతోంది||

బహుస్వల్ప కాలము తనకుందని తెలిసి - చెలరేగే సాతానుడు ఇలలోన 
ప్రభుకి నువు నిలిచావని జూసి - వలవేసి గురినిలిపాడు మలినాలు పెంచేటి - ఇహలోక ఆశలకు గడచిన కాలం చాలదా ? మల్లించబడతావని మరి మరి చూస్తున్నా ఆ తండ్రి ప్రేమ అర్ధమే కాదా ? 
చాలు చాలిక - పరిశుద్ధతలేని బతుకునకే 
చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథములకే 
చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే 
చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే ||పోతోంది||

నశియించు వారికైమానక పరుగిడుచు - నలిగారు హతసాక్షులు నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్తంటూ - చావైనా తలదించారు సంద్రాలుదాటేటి సహనాన్ని చూపిన - ఆ తెగింపునే చూడవా ... ? ఆ సాక్షమేఘాలు నిన్నా వరిస్తున్నా - ఇకనైనా కళ్ళు తెరవవా 
చాలు చాలిక - సోమరిగా జేసిన గతమునకే
చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే 
చాలు చాలిక - నువు సిలువేసిన అన్యాయముకే
చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే ||పోతోంది||

No comments: