Bhalashouryuda nee bhalathishayame | బలశౌర్యుడా నీ బలాతిశయమే

బలశౌర్యుడా నీ బలాతిశయమే - ఇంతవరకు నన్ను 
విజయోత్సాహముతో - ఊరేగించుచున్నది బహుతరములకు - శోభాతిశయముగ - మార్చుటకు  - నా ముందు
అ.ప: బలశౌర్యుడా - నా యేసయ్య - బహుధీరుడా - బహుబలవంతుడా

1. నా మార్గములన్నియు - నీకప్పగించుకొనగ 
నీ నీతి నియమములు - నేననుసరించగలిగితిని 
శత్రువు సంధించిన బాణబలము వలన - నా అడుగులు తడబడిపోగా
బహుధీరుడవై నా చేయి పట్టి - నా నడతను స్థిరపరచితివి ॥బలశౌర్యుడా॥

2. నిర్జీవ అరణ్యములు - నాకెదురవ్వగా - 
బలమైన ముండ్లపొదలు - అడ్డుకంచెగా నా త్రోవ మూసివేయగా 
ముందడుగు వేయలేని ఆ నిశిరాత్రిలో - నా గమ్యము కనుమరుగైపోగా 
నీతి సూర్యునివై నా ప్రక్క నిలిచి - అడ్డుతొలగించి పచ్చికగా మార్చితివి ॥బలశౌర్యుడా॥ 

3. నశించిన ఇశ్రాయేలు - జాలరులను పిలచితివి 
ఈ తరపు ప్రజలకు - పామరుడనైన నన్ను పిలచితివి రక్షణయే నాకు ప్రాకారముగా చేసి - ప్రఖ్యాతినే నాకు గుమ్మముగా నిలిపి 
న్యాయాధిపతివై నాకు న్యాయము తీర్చి - నా దుఃఖ దినములను సమాప్తము చేసితివి ॥బలశౌర్యుడా॥

No comments: