సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా
మహనీయుడవు నీవేనయా ...
1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా (2)
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2) ||కృపా||
2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా (2)
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే (2)|| కృపా||
3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా (2)
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే (2) ||కృపా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment