సువార్తను ప్రకటించుడి


🙏ప్రభువు నామములో అందరికి శుభములు🙏 
⛪నేడు దిన ధ్యానము⛪

✝️సువార్తను ప్రకటించుడి✝️

మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. 
మార్కు 16 : 15

కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఇప్పుడున్న వార్తా ప్రసార సాధనాలు (కమ్యూనికేషన్ సిస్టమ్) లేవు. చిన్న చిన్న పట్టణాల్లో, పల్లెల్లో టీవీ ఫోన్ ఇంటర్నెట్, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఉండేవి కావు. కనుక మనం పూర్తిగా ప్రింట్ మీడియా అంటే పత్రికల పైన ఎక్కువగా ఆధార పడే వాళ్లం. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కరపత్రాలు అంటే సువార్తకు సంబంధించిన పత్రికలు, పుస్తకాలు తీసుకుని రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడున్న ప్రయాణికులకు ఇచ్చే వాళ్ళము. విరామ బైబిల్ పాఠశాల (వి. బి. ఎస్.) పిల్లలుగా ఊరేగింపుగా వెళ్లి కరపత్రాలు పంచే వాళ్ళం. యేసయ్య సువార్తను ప్రకటించమన్నారని మేము ఇదంతా చేసేవాళ్లం. ఆయన “సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” అన్నారు.

ఆ రోజుల్లో అందరిని చేరలేక పోయాము. కానీ ఈ రోజుల్లో టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అందరినీ చేరుకోవచ్చు ప్రసార మాధ్యమం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. చాలా తక్కువ ధరలకే ఇంటర్నెట్ (అంతర్జాలం) దొరుకుతుంది. ఇంకా ఉచితంగా కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. కనుక మన సమయాన్ని వృధాగా పోనియక జ్ఞానంతో ఉపయోగించుకుందాం. మనకు దొరకినన్ని కమ్యూనికేషన్ సిస్టంలో, ప్రసారమాధ్యమాలు ఉపయోగించుకొని సువార్తను ప్రకటించుదాం.

యేసయ్య మనం అన్ని రకాల ఆశీర్వాదాలు అనుభవించాలని తన ప్రాణమే త్యాగం చేశారు. మనం సువార్తను ఇతరులకు ప్రకటించడం ద్వారా మన ప్రేమను వ్యక్తపరచాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఒకే ఒక కోరిక మన దగ్గర నుండి కోరుతున్నారు. కనుక సువార్తను ప్రకటించుదాం.

✝️ప్రార్థన:🛐
తండ్రీ, మాకు దొరికిన ఆధునిక ప్రసార సాధనాలన్నిటిని ఉపయోగించి, మాకు అయినంతవరకు మీ సువార్త ప్రకటించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.

No comments: