అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి ||అర్పింతు||
1.తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి (2)
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా (2) ||అర్పింతు||
2.నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం (2)
నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో (2) ||అర్పింతు||
3.నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు(2)
ఆనంద బాష్ప ములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే (2) ||అర్పింతు||
4.నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్ (2)
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను (2) ||అర్పింతు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment