జాలిగా మనుజాళికై , కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు, నా తుది శ్వాస ఆగేవరకూ ||దేవా నీ సాక్షిగా||
1.నాలాంటి నరమాత్రుని చేరుట - నీవంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విదితమే కాదిది - కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే - నా బ్రతుకంతా కొనియాడుట ||దేవా నీ సాక్షిగా||
2. నా ఊహకందని మేలుతో - నాా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా - నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము- నేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా నీ సాక్షిగా||
No comments:
Post a Comment