195
క్రీస్తు శ్రమల ధ్యానము
రా- ముఖారి, తా- ఆది
(ఛాయ: పాపము దలచు సుమీ) తా- ఆది
ఎన్నఁడు గాంచెదమో యేసుని - నెన్నఁడు గాంచెదమో = యెన్నఁడు జూతుము - కన్నె కుమారుని - సన్నుతి జేయుచును ||నెన్నఁడు||
1.అంధుల గాచె నఁట - యెహోవా - నందనుఁ డితఁడౌనట = పొందుగఁ బాపాత్ములకొర - కై తన - ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||
2.వేసిరి సిలువనఁట - క్రీస్తుని - జేసిరి హేళనఁట = డాసిరి యూదులఁట - బల్లెము - దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||
3.చిందెను రక్తమఁట - పరమ - సంధులు దెల్పెనఁట = నిందల కోర్చె నఁట - మన దగు - నేరము గాచెనఁట ||యెన్నఁడు||
4.ఆపద కోర్చెనఁట - పాపపు - మోపులు మోసెనఁట = కోపము మాన్పెనఁ ట - యెహోవా - కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||
5.అక్షయుఁ డితఁడెనఁట - జగతికి - రక్షకుఁ డాయెనఁట = దీక్షగ నమ్మిన నరులం - దరికి ని - రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||
– గొల్లపల్లి నతానియేలు
No comments:
Post a Comment