197
సిలువ ధ్యానము
రా - నాధనామాక్రియ, తా - ఆది
అయ్యో నాదగు ఘోరపాపము గదా - భారమై నీపై నొరిగె = నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ - కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||
1.నిరతము దూతానీక మూడిగము - నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు = నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ - బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||
2.కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను - లారఁ చూచుకొన నేరనట్టి యల = మేరి గర్భమున దూయఁబడిన కడు - ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||
3.మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ - మూపుపైన భారముగ మోపి = రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ - దయ్య వాసులెంత మాత్రమునుగా ||రయ్యో||
4.కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను - గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప = మాలి నీదు వదనమ్ముపై నుమియ - నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||
5.ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు - మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ = కండ్ల కొక్క గంతఁ గడ - గండు పెట్టఁ గారణము నిజముగా ||నయ్యో||
6.ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ - నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా = భావమందుఁ దలపోసి చూడ నల - బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||
– యెద్దు దానియేలు
No comments:
Post a Comment