332
పాపి పశ్చాత్తాపము
1.సిలువకు నిను నేగొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ||అపరాధిని||
2.ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కునపొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో ||అపరాధిని||
3.ముళ్లతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రి ||అపరాధిని||
4.దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ||అపరాధిని||
5.ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా ||అపరాధిని||
6.చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో - సందేహ మేలనయ్యా ||అపరాధిని||
7.శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యమునియ్య - మోక్షంబు జూపితివయ్యా ||అపరాధిని||
- సిరిపురపు కృపానందము
-----------------------------
Aparadhini yessayya - krupajupi bhrovumayya -
nepamenchakaye nee krupalo - naparadhamulanu kshaminchu ||aparadhini||
1. Siluvaku ninu negottitini - tuluvalalo - jerithini-
kalushambulanu mopitini - doshunda nenu prabhuva ||aparadhini||
2. Prakkalo ballepu potu - grakkuna podichithi nene -
mikkili bhadinchithini - makkuvu jupithivayyo ||aparadhini||
3. Mullatho kireetambu - nalli nee siramuna nidithi -
navalla neramaye - challani dayagala thandri ||aparadhini||
4. Daahambu gonaga chedu - chirakanu dravanidithi -
dhrohundanai jesithinee - dhehambu gaayambulanu ||aparadhini||
5. Ghorambuga dhurithini - nerambulanu jesithini -
khrurundanai - gottithini ghorampu paapini devaa ||aparadhini||
6. Chindhithi rakthamu naakai - pondina debbalachetha -
apa nindalu pettithinayyo - sandehamelanayya ||aparadhini||
7. Shikshaku paathrudanayya - rakshana dechitivayya -
akshaya bhagyamu niyya - mokshambu jupitivayya ||aparadhini||
- Siripurapu Krupanandam
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment